Skip to main content

Indira Sagar Polavaram project Facts

స్వాతంత్ర కాలంలో రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని పేరు తో సమగ్ర నమూనా ప్రచురించి దాదాపుగా 70 ఏళ్ళు కావస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు అంటే ఎంత దుర్భాగ్యమైన స్థాయిలో మన నాయకుల పాలనా ఉందొ తెలుస్తుంది , దీని స్థిగతులపైనా పైన మేము మీకు కొన్ని విషయాలు తెలియజేయడం కోసం ఈ విశ్లేషణలు ..
1947 సమయంలో 129 కోట్లు రూపాయల అంచనా వ్యయం గా భావించిన ప్రాజెక్ట్  ఇపుడు దాదాపుగా 20000 కోట్లు పై మాటే,
30 ఏళ్ల తరువాత 1980 లో టి అంజయ్య  గారు ముఖ్యమంత్రి గా నిర్మాణ పాలక వేసాడు కానీ పనులు , ప్రాజెక్ట్ నిర్మాణాకి సంబందించిన అనుమతులు తీసుకురాలేకపోయాడు.
మళ్ళి 25 సంవత్సరాల తరువాత 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ పనులకు కూడా శ్రీకారం పోసి మరియు ప్రాజెక్ట్ సంబందించిన అన్ని అనుమతులు అయన దేహం విడిచేలోపు తీసుకువచ్చి పోలవరం కి ప్రాణం పోసాడు .
పోలవరం ప్రాజెక్ట్ గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన వివరాలను బట్టి ఈ ప్రాజెక్ట్ ఇదే విధంగా సాగితే మరో 20 ఏళ్లకు కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు !! మేము చెప్పే ప్రతిఒక్కదానికి అధరాలు ఇస్తున్నాము.

2014 రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ని ఏర్పాటు చేసి ఈ అథారిటీ పర్యవేక్షణ లో ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం నిర్మించి రాష్ట్రానికి అప్పగించాలి అని స్పష్టం గా పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టం-2014 లో పొందుపరిచిన దాన్ని కూడా చూడొచ్చు కింద ఫోటో లో...
polavaram-in-ap-reorganization-act
రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ పేరు ను "ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ " నుండి "పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ " గా మార్చే దాన్లో ఉన్న శ్రద్ద పోలవరం ప్రాజెక్ట్ కట్టే దాన్లో లేదు ఎందుకు ?? 
capture
సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు మీకోసం ......
ఇటీవల కేంద్ర ప్రభుత్వం వండి వార్చిన స్పెషల్ ప్యాకేజి అని ప్రకటించినప్పుడు పోలవరం ని రాష్ట్రానికి బదిలీ చేస్తున్నాం అన్నారు, అది చేసి దాదాపు 40 రోజులవుతున్నా ఇంకా కేంద్ర జలవనరుల సంగం కి తెలియలేదా ?
ప్రాజెక్ట్ యొక్క అంచనాలు ఇటీవల 20 వేల కోట్లు పెంచిన విషయం కూడా వాళ్లకు తెలియదంటే, దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణిస్తున్నారా లేదా ?? special-assistance-1
special-assistance-2
ప్రాజెక్ట్ డిజైన్ ల విషయం లో కూడా గందరగోళమే, ప్రాజెక్ట్ అనుమతుల విషయం లో కూడా కచ్చితమైన సమాచారం కేంద్రం దగ్గర లేదంటే, పోలవరం పరిస్థితి ఎంత దయనీయం గా ఉందొ తెలుస్తోంది. 
capture1
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే ఈ బహుత్తర ప్రాజెక్ట్ కు ఈ గతి.

పై లింక్ లో చెప్పినట్టు పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ చేసినప్పటి నుండి దానికి కేటాయించింది అణాపైసలే !!
 capture

అసలు ప్రాజెక్ట్ కు CWC ఆమోదం తెలిపింది 16,010.45 కోట్లు, 108 వ టెక్నికల్ అడ్వైసరీ కమిటి ఆమోదమే రాలేదు ఇంకా !! దీన్ని జాతీయ ప్రాజెక్ట్ చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం 20వేల కోట్లు అంచనాలు పెంచింది. 2010-2011 రేట్ లకే ఇంకా అనుమతులు రాలేదు, మరి వీళ్ళు పెంచిన మొత్తానికి ఆమోదం రావాలంటే ఇంకో పుష్కర కాలం పట్టుతుందేమో.
capture1
ఈ మధ్య మనం పత్రికల్లో చూసాము, పోలవరం ప్రాజెక్ట్ కి సంబందించి విద్యుత్తు ఉత్పత్తి స్టేషన్ లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాం అని ప్రభుత్వ నిర్ణయం అని, అసలు జాతీయ ప్రాజెక్ట్ లో భాగమైన దానిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వవచ్చా ? ఈ సమాచారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర లేదు!!
http://www.thehindu.com/news/cities/Vijayawada/Tenders-for-Polavaram-power-station-next-month/article16080299.ece
కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని AIBP (Accelerated Irrigation Benifit Program) కింద తీసుకుని రాష్ట్రాలకు సహాయం చేస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కాకా ముందు 2008-2009, 2009-2010 ఆర్ధిక సంవత్సరాలలో 562 కోట్ల రూపాయలను ఈ పథకం కింద పోలవరం కి ఇచ్చింది, జాతీయ హోదా వచ్చిన తరువాత పూర్తి బాధ్యత కేంద్రానిది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2014 నుండి అప్పటి వరకు చేసిన కేటాయింపులు 900 కోట్లు మాత్రమే. ఇక్కడే అర్థం అవుతోంది పాలకుల చిత్తశుద్ధి ఈ ప్రాజెక్ట్ పైన. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పెయిన్ ఉన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఏమి అడగదు, అదేమంటే మేము అయితేనే త్వరగా పూర్తి చేస్తాము అని!! ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పుష్కర కాలం పడుతుంది ఏమో ఇదే పద్ధతులు అవలంబిస్తే!!
capture2
మళ్ళి ఇపుడు చూస్తే నిర్మాణ పనులు మొదలై దాదాపుగా ఒక దశాబ్ద కలం గడిచిన ఇంత వరకు పూర్తికావడంలేదు , ఒక వైపుఎమో కేంద్రం మరివైపు రాష్ట్ర ప్రభుత్వాలు మా బాధ్యత అంటూ స్టేమెంట్లు ఇస్తున్నాయి కానీ పోలవరం నిధులు విషయానికి వచ్చేసరికి వంద, రెండోదలు అనుకుంటూ ఎనిమిది సంవత్సరాలకు 1500 కోట్ల వరకు నిధులు ఇచ్చింది అంటే వాళ్ళ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో చుడండి ..
capture3
capture4capture5
2014 లో పట్టిసీమ కోసం విడుదల చేసిన జోవో 22 ద్వారా, ప్రతి ఏటా ప్రాజెక్ట్ వ్యయం లో 15% పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు కాంట్రాక్టర్ లకు. తెలుగుదేశం నాయకుల జేబులు నింపుకోవడానికి రాష్ట్ర రైతులను అధోగతి పాలు చేస్తున్న ఈ స్వార్థ దృతరాష్ట్ర పాలన లో జీవిస్తున్నందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు !!
ఆలోచించండి ఇలాంటి స్వార్థ ప్రభుత్వాలతో అభివృద్ధి సాధ్యమా ?? ఎమన్నా అంటే ప్రాజెక్ట్ ల ఎరియల్ సర్వే చేస్తున్నారు, వర్చ్యువల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అంటారు, కాలవ గట్ల పైన పనుకుంటాము అంటారు. కాలవ గట్లపైన పనుకుంటే ప్రాజెక్ట్ లు పూర్తి కావు, సరిపడా డబ్బులు ఇవ్వగలిగితే పూర్తి అవుతాయి.
పెద్దాయన రాజన్న హయం లో 12 ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యాయి, ఏనాడైనా కాలవ గట్టు పైన రాజన్న పనుకున్నాడా ?? అవసరమయ్యే డబ్బులు ఇబ్బంది లేకుండా ఇవ్వగలిగారు కాబట్టే ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యాయి !! అభివృద్ధి చేయాలి అనే చిత్తశుద్ధి ఉంటె ఎలాగైనా చేయొచ్చు, ఎప్పుడు దోచుకుని దాచుకుందాము అనే ధోరణి లో ఉంటె ఎలా అభివృద్ధి అవుతుంది !!

Comments

Popular posts from this blog

వైయస్సార్ తిరుమల కు ఏం చేసారు

"వై.యస్.ఆర్" తిరుమల ఏడు కొండలు ని రెండు కొండలు చెద్దాం అనుకున్నారా ? ఇందులొ నిజం ఎంటి.. ?? 2005 లొ తిరుమల అనే గ్రామం లొ పంచాయతి ఎన్నికలు జరగాలి అని ఒక అనామకుడు హైకొర్టు ని ఆశ్రయించాడు తిరుమల లొ రాజకీయము తగదు అనే ఉద్దేశం తొ 2005 న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జే.సి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జి.ఒ విడుదల చెసింది (జి.ఒ నెంబర్ 338) ఆ జీవొ లొ తిరుమలలొ 27.5 చదరపు కిలొ మిటర్లలొ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి , కార్యాలయాలు , ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయొజనాలకొసం ఏర్పర్చిన గ్రుహాలు , మరియు చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక టౌన్ షిప్ , ఒక పవిత్ర స్థలం ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు , మీటింగులు జరగటానికి వీలు లేదు అని చెబుతు జి.ఒ ని విడుదల చేశారు.. దీనికి ఆదారం గతం లొ 1975 డిసెంబర్ 2 న విడుదల చెసిన జి.ఒ 1605 ని ఉదహరిస్తు అందులొ ఉనట్టే చెప్పారు మిగత స్థలం అంత అడివి కాబట్టి అది కెంద్ర చెతులొ ఉంటది కాబట్టి ( ఈ జి.ఒ ని విడుదల చెసినప్పుడు 1975 జి.ఒ లొ లాగానే ఉదహరించారు ) ఈ జి.ఒ విడుదల చెసింది అప్పటి పంచాయతి రాజ్ ప్రిన్సిపల్ సె...

చంద్రబాబు పారదర్శక పాలన లో చీకటి జీవోలు !!

2014 జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1132 రహస్య జీవోలను విడుదల చేసింది. అదికూడా సాధారణ పరిపాలన, హోమ్, రెవిన్యూ, ఆర్ధిక విభాగ జీవోలు సింహభాగం రహస్యమే !!  ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే పర్యటనల  పేరిట కూడా రహస్య జీవో లు విడుదల చేసారు ?? ఆ పర్యటన లు ఎవరు ఎక్కడికి ఎప్పుడు చేసారో ఎందుకు చేసారో ప్రజలకు తెలియదు. ఇలాంటి రహస్య పర్యటన లకు ప్రజా సొమ్ము ఉపయోగించడం ఎంతవరకు సబబు ?? పర్యటన లకు సంబందించిన రహస్య జీవో లు ఏంటో కింద ఫోటో లో చూడొచ్చు !!  నిద్దర లేస్తే మాది పారదర్శక పరిపాలన, నీతివంతమైన పరిపాలన అని డప్పు కొట్టుకునే ప్రభుత్వ పెద్దలు వేల సంఖ్య లో రహస్య జీవో లు ఎందుకు, ఎవరి మెప్పు కోసం విడుదల చేసారో ప్రజలకు చెప్పాలి.  హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెరోల్ కి సంభందించిన జీవో లు కూడా ఉన్నాయి, ఎవర్ని పెరోల్ పైన పంపించారు ? ఎన్ని రోజులు పంపించారు ?? ఏ కారణాల చేత పంపించారు ?? ఇవేమి సామాన్యులకు తెలియకూడదు అంటే ప్రభుత్వం ఎదో రహస్య అజెండా తోనే ఈ రహస్య జీవోలు విడుదల చేసిందా??  ఆర్ధిక విభాగం లో రహస్య జీవోలతో ప్రజా సొమ్ము ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా ?? ఒకవేళ అద...

YSR Saviour Of Hinduism

Dr.YS Rajasekhar Reddy as a Chief Minister of Andhra Pradesh has done many things for the development of Hindu temples and Hindu pilgrim centers allover the state. Major developmental activities and decisions are as follows  In 2005 he ordered through Endowments department (GO:338, 26-September 2005) which states that the temple in Tirumala, offices, function halls, Residential buildings for pilgrims, Residential homes for the local people are collectively declared as a township and this is most sacred place for people of this nation. In such a place TTD and State government will not allow any political activities and public meetings which will disturb the pilgrims and devotees. After releasing this GO few political parties and organizations without understanding the motive of that GO, protested that Government is limiting Tirumala area. Still people are doing false allegations based on that GO for getting some political benefits which is a false news. Don't believe that fa...