"వై.యస్.ఆర్" తిరుమల ఏడు కొండలు ని రెండు కొండలు చెద్దాం అనుకున్నారా ? ఇందులొ నిజం ఎంటి.. ??
2005 లొ తిరుమల అనే గ్రామం లొ పంచాయతి ఎన్నికలు జరగాలి అని ఒక అనామకుడు హైకొర్టు ని ఆశ్రయించాడు
తిరుమల లొ రాజకీయము తగదు అనే ఉద్దేశం తొ 2005 న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జే.సి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జి.ఒ విడుదల చెసింది (జి.ఒ నెంబర్ 338) ఆ జీవొ లొ తిరుమలలొ 27.5 చదరపు కిలొ మిటర్లలొ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి , కార్యాలయాలు , ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయొజనాలకొసం ఏర్పర్చిన గ్రుహాలు , మరియు చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక టౌన్ షిప్ , ఒక పవిత్ర స్థలం ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు , మీటింగులు జరగటానికి వీలు లేదు అని చెబుతు జి.ఒ ని విడుదల చేశారు..
దీనికి ఆదారం గతం లొ 1975 డిసెంబర్ 2 న విడుదల చెసిన జి.ఒ 1605 ని ఉదహరిస్తు అందులొ ఉనట్టే చెప్పారు మిగత స్థలం అంత అడివి కాబట్టి అది కెంద్ర చెతులొ ఉంటది కాబట్టి ( ఈ జి.ఒ ని విడుదల చెసినప్పుడు 1975 జి.ఒ లొ లాగానే ఉదహరించారు ) ఈ జి.ఒ విడుదల చెసింది అప్పటి పంచాయతి రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరి ఐ.ఏ.యస్ యం.సామ్యుల్ అనే వ్యక్తి.
ఈ జి.ఒ ని పట్టుకుని ప్రతిపక్షమైన తెలుగుదేశం , బి.జే.పి పార్టి కలిసి వై.యస్ తిరుమల ఏడు కొండలని రెండు కొండలు గా చేశారు అని ప్రచారం అందుకున్నారు - ( వాస్థవం గా చూస్తే ఆ జి.ఒ ముఖ్య ఉద్దేశం జనసంచారం మటికి ఉన్న తిరుమల ప్రాంతం లొ ఎలాంటి రాజకీయ కర్యాకలాపాలు ఉండటానికి లేదు అని చెప్పటం)
ప్రతిపక్షాలు మాటలు నమ్మి కొంత మంది సాదువులు 2006 జులై 15 న నిరసన వ్యక్తం చేశారు ఇలా చెస్తు వారు తిరుమల ని కిలొ మీట్లర్ల లా కాకుండా ఏడు కొండలు అని మార్చి జి.ఒ ఇవ్వాలి అని అడిగారు, అలాగే 27 జులై 2006 న టి.టి.డి అదారిటి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తు తిరుమల 27.5 చదరపు కిలొ మిటర్లు కాదు అడవి తొ సహా అంత కలిపి 332 చదరపు కిలొ మీటర్ల ప్రాంతం అని కొత్త జి.ఒ ఇవ్వాలి అని అడిగారు.
అదే రొజు ప్రభుత్వ కెబినెట్ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవి ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని కెంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అది రాగానే ప్రభుత్వం 2007 జూన్ 2 న ఏడు కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, ౠషబాద్రి తిరుమలకి సంభందిచిన పవిత్ర ప్రదేశం అని జి.ఒ నెంబర్ 746 ని విడుదల చేశారు , దీని తొ పాటు రాష్ట్రం లొ ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని 747 జి.ఒ ని విడుదల చేశారు.
ఇక్కడ మనం ఆలొచించాల్సింది
1) హిందు మెజారిటి దేశం లొ రొజు లక్షలలొ భక్తులు వచ్చే ప్రదేశం ని రెండు కొండలు చెస్తాం అనే ఆలొచన రాజకీయం లొ ఉండే వారు చేస్తారా ??
2) తిరుమల ఆద్వర్యం లొ లేని అటవి ప్రాతం ని 1975 జొ.లొ లేదు కాబట్టి 2005 జి.ఒ లొ కూడ పెట్టలేదు ఇందులొ వై.యస్ తప్పు ఎంటి ?
3) నిజంగా 7 కొండలు తిరుమల వే అని ప్రకటించే హక్కు తనకి ఉంతే కెంద్ర అటవిశాక నుండి అనుమతి వచ్చే దాక సంవత్సరం పాటు ఎందుకు వై.యస్ ఎదురు చూశారు.
ఇలా రాజకీయాల నుండి తిరుమల దివ్యక్షేత్రం పవిత్రతని కాపాడుదాం అని ఆలొచించిన వై.యస్ మీద కేవలం రాజకీయ లబ్ధి కొసం దేవుడిని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ చేశారు తెలుగుదేశం వారు , దీనికి బాబు గారిని మొసే పత్రికలు వంత పాడాయి - హిందు ధర్మం మీద అత్యంత విశ్వాసం ఉన్నవాళ్ళ మనొభావాలు గాయపడ్డాయి - లేదు ప్రతిపక్షాలు వాటి అనుభంద మీడియా గాయ పడేలా చేశారు... ఇప్పటికైనా విజ్ఞులు నిజాలు గ్రహిస్తారు అని ఆసిస్తున్నాం...



Comments
Post a Comment