హంద్రీ - నీవా ప్రాజెక్ట్ ఫేస్-1 లో శ్రీశైలం నుండి జీడిపల్లి వరకు, ఫేస్-2 జీడిపల్లి నుండి అడవిపల్లి రిజర్వాయర్ వరకు తీస్కొని కర్నూల్, అనంతపురం, వైయస్సాఆర్, చిత్తూరు జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 50 లక్షల మందికి త్రాగునీరు కోసం 40టిఎంసి లతో మొదట ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తీసుకుంటే, చంద్రబాబు దాన్ని 5 టిఎంసి లకి కుదించి ఇది కేవలం త్రాగునీరుకే అని జీవో ఇచ్చాడు.
వైయస్సాఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇదే హంద్రీ - నీవా ను మళ్ళీ 40 టిఎంసి లకు పెంచి పనులు వేగవంతం చేసి 2004 జులై లో 1307 కోట్ల( జీవో : 73, 24/07/2004) తో చేపట్టి ప్రాజెక్ట్ ని ఇంకా ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా రీడిజైన్ చేపించి 2007 మార్చ్ లో 2774 కోట్లతో(జీవో 2, 1/3/2007) తీసుకోవడం జరిగింది.
ఫేస్ - 1 కింద కర్నూల్ జిల్లా శ్రీశైలం నుండి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు మొత్తం మూడు రిజర్వాయర్ లతో (క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి) మెయిన్ కెనాల్ తో పాటు డిస్ట్రిబ్యూటరీ లు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో మొత్తం 14టిఎంసిలను కృష్ణ నది నుండి తీసుకుంటారు. దీనిద్వారా 1,98,000 ఎకరాల ఆయకట్టు, 10లక్షల మందికి త్రాగునీరు.
దేనిలో మొత్తం 9లిఫ్ట్ లు (మల్యాల, బ్రాహ్మణకొత్తూరు, మల్లపల్లి, క్రిష్ణగిరి, కంబాలపాడు, లక్కసాగరం, గుండ్లపాడు, రేగులపాడు, ముచ్చుమర్రి ) తోపాటు పెరూర్ బ్రాంచ్ కెనాల్ ఇందులో భాగమే.
ఫేస్-1 డిజైన్

ఇంక ఫేస్-2 కి వస్తే, ఇది జీడిపల్లి నుండి చిత్తూరు జిల్లా కే.వి పల్లి (కంభంవారిపల్లి) మండలం లో అడవిపల్లి రిజర్వాయర్ వరకు.సాగునీరు ను 4, 04,500 ఎకరాలకు, త్రాగునీరు 23లక్షల మందికి అందించేలా డిజైన్ చేసారు.
జీడిపల్లి నుండి అడవిపల్లి రిజర్వాయర్ వరకు నాలుగు లిఫ్ట్ లు, ఐదు రిజర్వాయర్ లు (గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల,శ్రీనివాసపురం, అడవిపల్లి). మొత్తం మూడు బ్రాంచ్ కెనాల్స్(మడకశిర, పుంగనూరు, నీవా), మూడు డిస్ట్రిబ్యూటరీ లు (తంబళ్లపల్లి, వాయల్పాడు, ఆత్మకూరు).
ఫేస్-2 డిజైన్

రాయలసీమ జిల్లాల్లో మండలాల వారీగా ఆయకట్టు వివరాలు




ఇది ప్రాజెక్ట్ యొక్క డిజైన్ ఫైనలైజ్ చేసి ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టించిన వైయస్సాఆర్ గారి ప్రభుత్వం దాదాపు 4500 కోట్లు ఖర్చు పెట్టి 80శాతం పనులు పూర్తి చేసారు వైయస్సాఆర్ గారి ప్రభుత్వం లో. తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని సరిగా పట్టించుకోకుండా వదిలేయడం తో ప్రాజెక్ట్ మూలానపడింది.
తరువాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా అరకొర కేటాయింపులతో లిఫ్ట్ ల మోటార్ ల కరెంటు బిల్లులకు కూడా సరిపోని విధంగా కేటాయింపులు చేస్తూ ప్రాజెక్ట్ యొక్క ఆశయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు.
ప్రభుత్వ వెబ్సైటు ప్రకారం ఫేస్-2 లోని రిజర్వాయర్, సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ల ప్రస్తుత పరిసితులు

అధికారం లోకి రాగానే చంద్రబాబు కు తన సొంత నియోజకవర్గం గుర్తొచ్చి అనంతపురం జిల్లాలో కొన్ని ప్యాకేజీల కింద డిస్ట్రిబ్యూటరీ(కాల్వల నుండి పొలాలకు నీళ్లు అందించే వ్యవస్థ ) వ్యవస్థలను రద్దు చేసి చిత్తూరు జిల్లా లో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ టైల్ ఎండ్ అయిన పెద్దపంజాణి మండలం నుండి కుప్పం వరకు దాదాపు 100 కిలోమీటర్లు నీళ్లు తీసుకుపోవడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను తీసుకున్నారు.
దీనిలో భాగంగా మల్యాల దగ్గర ముచ్చుమర్రి గ్రామం దగ్గర శ్రీశైలం లో నీళ్లు 834 అడుగుల కంటే కింద ఉన్నా కూడా తీసుకునేలా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు పూనుకోవడం జరిగింది. ఈ ముచ్చుమర్రి నే మొన్న ఇప్పటి ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి తన కల అని దండోరు ఏస్కున్నాడు, అసలు ఇది అయన పాలన లో ఆయనెందుకు తీసుకోలేదు.
ఈ బ్రాంచ్ కెనాల్ లో నీళ్లు తీసుకుపోవడానికి అనంతపురం లో పొలాలు పోగొట్టుకున్న రైతులకు తీవ్ర అన్యాయం చేసి వాళ్ళ మిగిలిన పొలాలకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ లను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం. కుప్పానికి నీళ్లు ఇవ్వొద్దు అని అనడం లేదు, దానికోసం అనంతపురం ప్రజల కడుపు కొట్టొద్దు అంటున్నాం. కుప్పం పైన అంత ప్రేమున్నోడు 1994 నుండి ఏమి చేసాడు కుప్పం బ్రాంచ్ కెనాల్ ఎందుకు చేర్చలేదు ప్రాజెక్ట్ డిజైన్ లో ?
ప్రస్తుతం కొన్ని ప్రదేశాల్లో కోర్ట్ కేసుల వల్ల, భూ సేకరణ పూర్తి అవ్వకపోవడం వల్లన ప్రాజెక్ట్ పనులు నత్తనడకన నడుస్తున్నా కూడా, ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చెయ్యట్లేదు .
జీడిపల్లి రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నా ఉరవకొండ నియోజకవర్గం లో ఇవ్వాల్సిన 80000 ఎకరాల ఆయకట్ట్టుకు నీళ్లు వదలకుండా రైతులను వంచిస్తూ ప్రభుత్వం సాధించాలనుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు ఎన్ని ప్రజా ఉద్యమాలు చేసినా స్థానిక ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తన స్వార్థం కోసం రైహులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు, ఇలా చేస్తూనే నేను ఉరవకొండ ప్రజల ఆశాజ్యోతి అంటూ తిరగడం సిగ్గులేని పనులు చేయడం. ఇలాంటోళ్లకు సిగ్గుండాలి.
పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం లోని గొల్లపల్లి రిజర్వాయర్ పరిధిలో ఒక కార్ ల పరిశ్రమ కోసం వేళా ఎకరాల భూసేకరణ చేసి, రైతుల కడుపు కొడుతున్న ప్రభుత్వం. ఎదో ఇప్పటికైనా హంద్రీనీవా నీళ్లు వచ్చాయి, ఇక వాళ్ళ పొలాలలో బంగారు సిరులు పండించుకోవచ్చు అని అనుకుంటుండగా గొల్లపల్లి రిజర్వాయర్ లోని నీళ్లతోనే ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి వాళ్ళ భూములనే లాక్కుంటే ఎట్లా ?? నీటి సదుపాయం లేకుండా, పంటలకు అనువైన ప్రదేశాలు కానీ ఎన్నో వేల ఎకరాలు ఉంటె వాటిని వదిలేసి ఇలా చేయడం దారుణం!!
తాను అధికారం లో ఉన్నప్పుడు కేవలం 13 కోట్లు (9ఏళ్లకు ) కేటాయించి కనీసం 10కిలోమీటర్ లు కూడా కాలవ తవ్విన దాఖలాలు లేవు. అలంటి వ్యక్తి ఈరోజు మాటకొస్తే హంద్రీ నీవా కాలవ గట్ల పైన మంచం ఏస్కోని నిద్రపోతే అంటే నామమెంత పిచ్చోళ్ళు కాదు జనాలు. తాను అధికారం లో ఉన్నప్పుడు కొద్దో గొప్పో పనులు పూర్తి చేసుంటే బచావత్ ట్రిబ్యునల్ ముగియ సమయానికి ఈ ప్రాజెక్ట్ కు అరకొర కేటాయింపులైనా వచ్చేవి కదా? ప్రాజెక్ట్ ని, రాయలసీమ ప్రజలను ఇంతగా మోసం చేసి, రాయలసీమ కు బద్ద వ్యతిరేకి అయిన దేవినేని ఉమామహేశ్వర రావు ను నీట్టిపారుదల శాఖ మంత్రి గా చేస్తే రాయలసీమ కు నీళ్లెలా వస్తాయి ?
ఇందులో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చేర్చడం జరిగింది, దీనికి అనుబంధం గా వచ్చే తరువాతి వాటిల్లో ఇప్పటి పరిస్థితులు, ఇప్పటి ప్రభుత్వ చిత్తశుద్ధిని ఆధారాలతో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం!!
Comments
Post a Comment