2014 జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1132 రహస్య జీవోలను విడుదల చేసింది. అదికూడా సాధారణ పరిపాలన, హోమ్, రెవిన్యూ, ఆర్ధిక విభాగ జీవోలు సింహభాగం రహస్యమే !!
ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే పర్యటనల పేరిట కూడా రహస్య జీవో లు విడుదల చేసారు ?? ఆ పర్యటన లు ఎవరు ఎక్కడికి ఎప్పుడు చేసారో ఎందుకు చేసారో ప్రజలకు తెలియదు. ఇలాంటి రహస్య పర్యటన లకు ప్రజా సొమ్ము ఉపయోగించడం ఎంతవరకు సబబు ?? పర్యటన లకు సంబందించిన రహస్య జీవో లు ఏంటో కింద ఫోటో లో చూడొచ్చు !!
నిద్దర లేస్తే మాది పారదర్శక పరిపాలన, నీతివంతమైన పరిపాలన అని డప్పు కొట్టుకునే ప్రభుత్వ పెద్దలు వేల సంఖ్య లో రహస్య జీవో లు ఎందుకు, ఎవరి మెప్పు కోసం విడుదల చేసారో ప్రజలకు చెప్పాలి.
హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెరోల్ కి సంభందించిన జీవో లు కూడా ఉన్నాయి, ఎవర్ని పెరోల్ పైన పంపించారు ? ఎన్ని రోజులు పంపించారు ?? ఏ కారణాల చేత పంపించారు ?? ఇవేమి సామాన్యులకు తెలియకూడదు అంటే ప్రభుత్వం ఎదో రహస్య అజెండా తోనే ఈ రహస్య జీవోలు విడుదల చేసిందా??
ఆర్ధిక విభాగం లో రహస్య జీవోలతో ప్రజా సొమ్ము ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా ?? ఒకవేళ అదే నిజమైతే పరిపాలన లో పారదర్శకత ఎక్కడ ?? ఈ చీకటి జీవోల ద్వారా ఎన్ని కోట్ల ప్రజా సొమ్ము పక్కదారి పట్టింతుందో ఊహకందని లెక్క !!
ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక website http://goir.ap.gov.in/ నుండి సేకరించినవే, ఎవరికైనా అనుమానం ఉంటె పై లింక్ లో పరిశీలించొచ్చు !!
నిజంగానే ఇవి రాష్ట్ర భద్రత కు సంబంధిన జీవో లు అందుకే రహస్యం అంటే అందరు ఒప్పుకోవాల్సిందే, కానీ రహస్యం పేరిట అనివీతి కార్యక్రమాలు ఏవైనా ఉంటె అవి ప్రజలకు తెలియాలి కదా !!
Comments
Post a Comment